కుక్కల దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

కుక్కల దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

SRCL: కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో మంగళవారం కుక్కలు స్వైర విహారం చేసి ఇద్దరిపై దాడులకు పాల్పడ్డాయి. గ్రామానికి చెందిన ద్యావనపెల్లి కౌసల్య, లింగంపల్లి దేవయ్య అనే వ్యక్తులపై దాడి చేశాయి. ఇద్దరికీ కాళ్లకు గాయాలు కాగా స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం అస్పత్రి తరలించారు. పిచ్చికుక్కల దాడి నుంచి ప్రజలను కాపాడాలని గ్రామస్తులు అధికారులను కోరారు.