VIDEO: ‘అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి’
MNCL: నేత్ర, శరీర, అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని MLA గడ్డం వినోద్ పిలుపునిచ్చారు. ఇవాళ బెల్లంపల్లిలో వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి కాంట చౌరస్తా వరకు కొనసాగింది. అవయవ దానంతో మరొకరికి పునర్జన్మనిచ్చిన వారవుతారన్నారు.