డ్రంక్ అండ్ డ్రైవ్.. రూ.2.6 లక్షల జరిమానా
TPT: తిరుపతి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 26 మందిపై కేసులు నమోదు చేశారు. కోర్టు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించింది. అదేవిధంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 47 మందిపై కేసులు నమోదు చేసి రూ.23,500 జరిమానా వసూలు చేశారు. పోలీసులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ప్రజలకు సూచించారు.