బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 150 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 45 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞాన, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ తప్పనిసరి. పూర్తి వివరాలకు acab.bank.inను సంప్రదించండి. ఈ నెల 20 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.