ఏప్రిల్ 15 నుంచి ఫార్మ్-డీ పరీక్షలు
NTR: జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్-డీ 3/4 సెమిస్టర్ థియరీ పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 1 లోపు ఫీజు చెల్లించాలన్నారు. 2వ తేదీలోపు రూ.100 ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.