పాలమూరు ఎంపీ డీకే అరుణకు నిరుద్యోగుల వినతి

MBNR: జిల్లా కేంద్రంలోని నిరుద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీ డీకే అరుణ నివాసంలో నిరుద్యోగ జేఏసీ వారు శనివారం వినతి పత్రం అందజేశారు. అన్ని శాఖల్లోని ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి, తదితర సమస్యలు పరిష్కరించాలని ఆమెను కోరారు. డీకే అరుణ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని అన్నారు.