విలక్షణ నటుడిని కోల్పోవడం బాధాకరం: వద్దిరాజు

KMM: ప్రముఖ నటుడు, మాజీ ఎమ్మెల్యే కోటా శ్రీనివాసరావు మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం తెలిపారు. కోట శ్రీనివాసరావు తన విభిన్న పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న విలక్షణ నటుడని పేర్కొన్నారు. అతని మృతితో తెలుగు సినీ పరిశ్రమ అపూర్వ నటనా నిపుణుడిని కోల్పోయిందని, ఆ లోటు పూడ్చలేనిదని అభిప్రాయపడ్డారు.