నేడు రక్తదాన శిబిరం

TPT: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ పార్కు సమీపంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు యువతరం సేవాసమితి సభ్యులు తెలిపారు. రుయా ఆస్పత్రిలో రక్త నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో వారి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.