భారీ వర్షాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

ప్రకాశం: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం తహసీల్దార్లకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, కూలిపోయే స్థితిలో ఉన్న పాత ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆమె ఆదేశించారు.