యాదగిరిగుట్టలో వాటర్ ప్లాంట్ ప్రారంభం

BHNG: యాదగిరిగుట్ట హయగ్రీవ దేవాలయంలో దివిస్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రధాన అర్చకుడు లక్ష్మీనరసింహ స్వామి చార్యులు ప్రారంభించారు. దివిస్ కంపెనీ రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని కొనియాడారు. ఈ ప్లాంట్ ద్వారా భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.