ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

AKP: రోలుగుంట మండలం అర్ల గ్రామంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన పెట్టుబడులు తగ్గుతాయి, భూసారం పెరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలు తినడం వలన ఆరోగ్యం బాగుంటుందని తెలియజేశారు.