బొల్లాపల్లిలో ఉచిత గాలికుంటు టీకాల పంపిణీ

బొల్లాపల్లిలో ఉచిత గాలికుంటు టీకాల పంపిణీ

PLD: బొల్లాపల్లి మండలం అయ్యన్నపాలెం గ్రామంలో వెటర్నరీ అసిస్టెంట్ శివుడు నాయక్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు టీకాల పంపిణీ సోమవారం ప్రారంభించారు. ఈ నెల 16 నుంచి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ టీకాలను రైతులు అపోహలు వీడి తమ పశువులకు, దూడలకు వేయించాలని సూచించారు.