సీతారాములకు పట్టువస్త్రాలు సమర్ఫించిన ముస్లిం మహిళ
KNR: శ్రీ రామ నవమి సందర్భంగా ఓ ముస్లిం మహిళ సీతారాములపై భక్తిని చాటుకుంది. ఇల్లందకుంటలో సీతారామచంద్రస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ సందర్బంగా అభేధాబా తాను తయారు చేసిన పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించింది. ముస్లిం మహిళ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మత సామరస్యానికి ప్రతీక అంటూ ప్రశంసిస్తున్నారు.