VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు
BDK: బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాణసంచా పొగ కారణంగా సిద్ధు, రవి అనే ఇద్దరు యువకులను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో వారిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. సిద్ధు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.