'కాకినాడలో హైడ్రా విధానాన్ని ప్రవేశపెట్టాలి'
కాకినాడ నగరంలో కూడా హైడ్రా విధానాన్ని ప్రవేశపెట్టి ఆక్రమణలు తొలగించాలని CITU జిల్లా కార్యదర్శి మేడిశెట్టి వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. కాకినాడ ఒకటో వార్డులో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని వెంకటరమణ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆక్రమణపై ఫిర్యాదు చేశామన్నారు.