అక్టోబర్‌లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు

అక్టోబర్‌లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు

దేశంలో మరోసారి రికార్డు స్థాయిలో GST వసూళ్లు నమోదయ్యాయి. ఇటీవల మొత్తం 375 రకాల ఉత్పత్తులపై GSTని కేంద్రం తగ్గించినా.. పండగ కొనుగోళ్లు వేళ అక్టోబర్ నెలలో రూ.1.96 లక్షల కోట్ల వసూళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో అక్టోబర్ నెలలో వచ్చిన రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లతో పోల్చినప్పుడు ఈ  మొత్తం 4.6 శాతం అధికం కావటం విశేషం.