VIDEO: బీచుపల్లి ఘాట్‌లో శివాజీ రాజా పూజలు
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బీచుపల్లి పుష్కర ఘాట్‌లో తెలుగు సినీ నటుడు శివాజీ రాజా తన పితృదేవతలకు పిండప్రదానం నిర్వహించారు. పురోహితుడు అనిల్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.