అనంతపురంలో జోరుగా జనసేన సభ్యత్వ నమోదు

అనంతపురంలో జోరుగా జనసేన సభ్యత్వ నమోదు

అనంతపురంలో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన సభ్యత్వ నమోదు కేంద్రాన్ని అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ మంగళవారం సందర్శించారు. పండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులతో నేరుగా మాట్లాడి సభ్యత్వాలు చేయించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సభ్యత్వం కేవలం గుర్తింపు మాత్రమే కాదని, కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.