'రోడ్డు ప్రమాదాల నివారణకు అందరి కృషి అవసరం'
ఎన్టీఆర్ జిల్లా అధికారులు రాష్ట్రంలోనే తొలిసారిగా బ్లాక్ స్పాట్స్ ప్రమాద పరిశీలన యాత్ర ఇవాళ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబుతో కలిసి అధికారులు 28 ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు అందరి కృషి అవసరమని, ప్రజల్లో మార్పు కనిపించిందన్నారు. ఈ ఏడాది ప్రమాదాల రేటు తగ్గిందని కలెక్టర్ తెలిపారు.