ఈ నెల 13న పెద్దపల్లిలో జాబ్ మేళా
పెద్దపల్లి: ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 13న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. కరీంనగర్ రెడ్డీస్ ఫౌండేషన్లో ఉచిత వసతితో 3 నెలలు శిక్షణ, ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. డిప్లమా, బీటెక్, ఎలక్ట్రికల్, మెకానికల్తో పాటు 18-28 సం.లోపు వయస్సు గలవారు అర్హులన్నారు. వివరాలకు 89853 36947 నెంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు.