ఏకగ్రీవంగా SFI నూతన కమిటీ ఎన్నిక
కృష్ణా: ఉయ్యూరు SFI నూతన కమిటీ ఎన్నిక సోమవారం ఏకగ్రీవంగా జరిగింది. SFI జిల్లా కార్యదర్శి సమరం మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ, కార్పొరేట్ సెక్టార్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. పీ4 విధానాన్ని ప్రవేశపెట్టి, ప్రభుత్వ విద్యను దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.