బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకుడు
సిరిసిల్ల: రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్యాక్స్ డైరెక్టర్ బుర్ర శంకర్ గౌడ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరిన ఆయనకు వేముల ప్రశాంత్ రెడ్డి కండువా కప్పి స్వాగతం పలికారు. మండలంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.