VIDEO: కలెక్టరేట్ ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా

VIDEO: కలెక్టరేట్ ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా

SRCL: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్ ముందు భవన నిర్మాణ కార్మికులతో కలిసి మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును కాపాడాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగంపై విచారణ జరపాలన్నారు.