నవంబర్ 2 నుంచి లండన్ పర్యటనకు మంత్రి దుర్గేశ్
AP: మంత్రి కందుల దుర్గేశ్ వచ్చే నెల 2 నుంచి 6 వరకు లండన్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ట్రావెల్ మార్కెట్-2025లో ఆయన పాల్గొననున్నారు. ఏపీ తరఫున స్టాల్ ఏర్పాటు చేసి పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాలను వివరించనున్నారు. ఈ మేరకు మంత్రి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.