మినీ స్టేడియానికి స్థలం పరిశీలించిన మంత్రి
NRPT: ఊట్కూరు మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు కోసం మంత్రి వాకిటి శ్రీహరి గురువారం పాత ఆట స్థలాన్ని పరిశీలించారు. ఆర్డీఓలతో కలిసి స్థల సమస్యలపై సమీక్షించారు. ఆటస్థలం పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ను చెక్పోస్ట్ వైపు మార్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు మంత్రి తెలిపారు.