'భవన మరమ్మతులకు నిధులు అందజేయాలి'
MDK: తూప్రాన్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని న్యాయవాదులు కోరారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు సోమవారం వినతి పత్రం అందజేశారు. స్వయంగా పర్యవేక్షణ చేసి మరమ్మతుకు కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.