పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఐ

ప్రకాశం: బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మల్లికార్జున ప్రజలకు సూచనలు సలహాలు ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు సీఐ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.