పూజలు నిర్వహించిన జీసీసీ ఛైర్మెన్

ADB: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామ నాగోబా దేవాలయంలో జీసీసీ ఛైర్మెన్ కోట్నాక తిరుపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలాల అమావాస్య సందర్భంగా ఆయన శనివారం దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన పోలాల అమావాస్య పండుగలో ఆయన పాల్గొన్నారు. అలాగే దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆయనను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.