చేపల వేటకు వెళ్లి వ్యక్తి దుర్మరణం

JGL: పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె రాయనర్సు (55) ఆదివారం చేపల వేటకు వెళ్లి దుర్మరణం పాలయ్యారు ఉదయం చేపల వేటకు చెరువులోకి వెళ్ళాడు. తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో పొలం గట్టు మీద పడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కిరణ్ కుమార్ విచారణ జరుపుతున్నారు.. రాయనర్సు మృతి పట్ల గ్రామంలో విషాదం అలుముకుంది