'రైతులకు పంట నమోదు తప్పనిసరి'
KDP: రబీలో సాగు చేసిన పంటలకు పంట నమోదు ఈనెల 20వ తేదీ వరకు చివరి అవకాశం అని మండల ఏవో మారెడ్డి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ముద్దనూరులోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. రైతులు ఏపీ ఎయిమ్స్ ఆప్‌ను డౌన్లోడ్ చేసుకొని వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేసే పనులు, పథకాల గురించి సమాచారం తెలుసుకోవచ్చు అన్నారు. ఈ వివరాలకై రైతు సేవ కేంద్ర సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.