రోడ్డు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి
TG: చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తోనూ ఫోన్‌లో మాట్లాడారు. టిప్పర్ లారీ రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీ కొట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు.