ముగిసిన స్వర్ణగిరి వసంత నవరాత్రి మహోత్సవాలు
BHNG: స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. నిన్న చివరి రోజు కావడంతో శ్రీ రామాయణ పారాయణ క్రతువు మహాయజ్ఞం వేదమంత్రాల నడుమ దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామివారికి సుగంధ భరిత ద్రవ్యాలతో నవకళశ పూర్వక పంచామృతాభిషేకం చేశారు.