రెండు బైకులు ఢీ పలువురికి గాయాలు.
రామాయంపేట: మండలంలోని తొనిగండ్ల శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వేసవి సెలవుల నేపథ్యంలో ఆలేరు హాస్టల్ నుండి విద్యార్థులను తీసుకుని నారాయణఖేడ్ వెళ్తుండగా టీవీఎస్ ఎక్సెల్ బైకును ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా, బాధితులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.