ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తహసీల్దార్..!
NLG: వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్ శ్రీకాంత్ నిర్వాహకులకు సూచించారు. ఆదివారం మధ్యాహ్నం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల ఖాతాల్లో కనీస మద్దతు ధర చెల్లింపులను ఆలస్యం చేయకుండా వెంటనే జమ చేయాలన్నారు.