MLAల పనితీరు మెరుగుపడింది: చంద్రబాబు
AP: ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సమీక్షలు, వన్ టూ వన్ భేటీల ద్వారా దాదాపు అందరు ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందని, మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సిన ఉందన్నారు. ప్రతి ఒక్కరి పనితీరుపైనా నాలుగైదు మార్గాల్లో కచ్చితమైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని గుర్తుచేశారు.