'దేశంలో సమైక్యత సాధించటమే పౌరుల కర్తవ్యం'

'దేశంలో సమైక్యత సాధించటమే పౌరుల కర్తవ్యం'

కృష్ణా: దేశంలో సమైక్యత సాధించటమే పౌరుల కర్తవ్యం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హైస్కూల్, జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి జాతీయ జెండా ఎగురవేశారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.