తగ్గిపోయిన పూల ధరలు

తగ్గిపోయిన పూల ధరలు

CTR: సంక్రాంతి పండుగ నెలలో పెరగాల్సిన పూల ధరలు తగ్గిపోయాయి. ఎన్నడూ లేని విధంగా పూర్తిస్థాయిలో ధరలు పడిపోయాయి. అటు రైతులు, ఇటు వ్యాపారులు నిరాశకు గురయ్యారు. పుంగనూరు మార్కెట్‌లో గతంలో బంతిపూలు రూ.80 పలకగ శనివారం ప్రస్తుతం రూ.10 చేరాయి. రోజా రూ.120, చామంతి రూ.40, కాగడాలు రూ.300, లిల్లీలు రూ.50, కనకాంబరాలు రూ.800 ఈ విధంగా పూల ధరలు పలికాయి.