సర్పంచ్ పదవికి వేలం.. రూ. 90 లక్షలకు ఏకగ్రీవం
GDWL: గట్టు మండలం మిట్టదొడ్డి సర్పంచ్ పదవికి ఇవాళ గ్రామస్థులు వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో రూ. 90 లక్షలకు సర్పంచ్ పదవికి కుమ్మరి శేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మొత్తం సొమ్మును గ్రామంలోని వివిధ అభివృద్ధి అవసరాలకు ఖర్చు చేయనున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పోలింగ్ అధికారులకు నేడు వినతి పత్రం అందించారు.