ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డు అందజేత

ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డు అందజేత

MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ ఏఈవో త్రిసంధ్యకు ఉత్తమ మహిళ ఉద్యోగి అవార్డు లభించింది. క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల రైతులకు ప్రభుత్వ పథకాలను తెలియజేయడంలో ఆమె విశేష సేవలు అందిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో త్రిసంధ్యకు కలెక్టర్ కుమార్ దీపక్ అవార్డును ప్రదానం చేశారు.