ఉమ్మడి జిల్లాలో 2,803 మందికి లబ్ధిదారులు

ఉమ్మడి జిల్లాలో 2,803 మందికి లబ్ధిదారులు

NLG: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్ష లోపు రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లాలోని 2,803 మంది చేనేత కార్మికులకు రూ.23.25 కోట్ల రుణమాఫీ కానుంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2024 మధ్య తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.