'ఊహించని విధంగా ఉదయగిరిలో పరిశ్రమలు వస్తాయి'
NLR: గతంలో ఎవరూ ఊహించని విధంగా ఉదయగిరిలో పరిశ్రమలు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వింజమూరులో ఆయన మాట్లాడుతూ.. పంటలు పండక ప్రజలు వలస వెళ్లిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. బయట సంపాదించిన వారు స్వగ్రామంలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఇందులో భాగంగా కూటమి నేతలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.