తెలంగాణకు విముక్తి కల్పించిన గొప్ప నేత పటేల్
KNR: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కరీంనగర్లో జరిగే యూనిటీ మార్చ్ ప్రోగ్రాం సన్నాహక సమావేశం బుధవారం చొప్పదండి మండల బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. నిజాం నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన గొప్ప నేత పటేల్ అని కొనియాడారు. అక్టోబర్ 31న జయంతి సందర్భంగా గ్రామాల్లో యువతలో ఐక్యత స్ఫూర్తిని నింపాలన్నారు.