బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతి
బాపట్ల రైల్వే స్టేషన్ ఆవరణలోని పార్క్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం పార్క్‌లో మృతదేహాన్ని స్థానికులు గమనించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.