సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ
AKP: నక్కపల్లి మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో అత్యున్నత స్థాయి భద్రత ప్రోటోకాల్ అమలు చేయాలని ఐజీ ఆదేశించారు. అనంతరం సభా ప్రాంగణం, హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించారు.