పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ
NGKL: అచ్చంపేట సబ్‌డివిజన్ పరిధిలోని అమ్రాబాద్, పదర, అచ్చంపేట, ఈగలపెంట పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ గురువారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను ఆయనే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.