రేపటి నుంచి సీటీలో పోలీస్ యాక్ట్ అమలు

SDPT: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు నిర్వహించవద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ సూచించారు. ఈ నెల 11న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు సీటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. కావున పోలీసుల అనుమతి లేకుండా ఏలాంటి ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించకూడదని పేర్కొన్నారు.