పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

కృష్ణా: ఘంటసాల మండల ఘంటసాలపాలెం శివారులో పేకాట శిబిరంపై పోలీసులు ఇవాళ మెరుపు దాడి చేశారు. ఎస్సై వేమన చందన తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ ఘటనలో పేకాట ఆడుతున్న నలుగురుని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.2820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.