అలంకార శోభితంగా శ్రీశైల మల్లన్న ఆలయం

NDL: కుంభోత్సవం సందర్భంగా శ్రీశైలం ఆలయంలో చేపట్టిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు పండితులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆలయంలోని శిల్ప సంపద కలిగిన స్తంభాలకు నిమ్మ పండ్లతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం కొనసాగుతోంది.