VIDEO: గ్యాస్ లీకేజీ.. తప్పిన పెను ప్రమాదం
అన్నమయ్య: కొత్తకోట పట్టణంలోని ఓ చికెన్ సెంటర్‌లో శనివారం రాత్రి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన షాపు యజమాని మండుతున్న సిలిండర్‌ను బయటకు లాక్కొచ్చాడు. దీంతో స్థానికులు, వాహనదారులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న సీఐ గోపాల్ రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.