భారీగా గంజాయి పట్టివేత

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో 424 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో నలుగురు గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్‌కు గంజాయిని తరలిస్తుండగా సీజ్ చేశారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.